అనంతపురం జిల్లా కదిరి ముత్యాలచెరువు సమీపంలో ఓ కండక్టర్ బలన్మరణానికి పాల్పడ్డాడు. కదిరి ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఓబులదేవర చెరువు మండలం గౌనిపల్లికి చెందిన అక్కులప్ప ఉరేసుకున్నాడు. శుక్రవారం ఉదయం విధులు ముగించుకొని వెళ్లి... మధ్యాహ్నం వరకు ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు డిపోకు ఫోన్ చేశారు. శనివారం ఉదయం ముత్యాల చెరువు వద్ద చెట్టుకు ఉరివేసుకొన్న విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా...వారు ఆర్టీసీ అధికారులకు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ఆర్టీసీ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
ముత్యాలచెరువు సమీపంలో ఆర్టీసీ కండక్టర్ ఉరేసుకుని ఆత్మహత్య - ముత్యాలచెరువు వద్ద ఆత్మహత్య వార్తలు
అనంతపురం జిల్లా కదిరి మండలం ముత్యాలచెరువు సమీపంలో ఆర్టీసీ కండక్టర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
ముత్యాలచెరువు సమీపంలో ఆర్టీసీ కండక్టర్ ఉరేసుకుని ఆత్మహత్య