ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బస్సు ఉంది.. ప్రయాణికులే లేరు! - no passengers are coming to madakasira rtc bus station latest news

మడకశిరలో రెండో రోజు ప్రయాణికుల సంఖ్య అమాంతంగా తగ్గిపోయారు. ఉద్యోగ రీత్యా పయనించే వారు తప్ప ఇతరులు ఎవ్వరూ రాలేదు. ప్రయాణికుల కోసం ఉదయం ఏడున్నర గంటలకు బస్టాండ్​ ప్రాంగణంలో పెడితే... మధ్యాహ్నం 12 గంటలు దాటినా ఒక్క ప్రయాణికుడు రాకపోయేసరికి చేసేదేమీ లేక బస్సును డిపోకు తరలించారు. ప్రజల్లో ఉన్న కరోనా భయమే ఇందుకు కొందరు అభిప్రాయపడ్డారు.

rtc buses not having passengers and buses sending to their depot in madaksira
ఖాళీగా ఉన్నఆర్టీసీ బస్సు

By

Published : May 23, 2020, 12:21 PM IST

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వైరస్ తీవ్రత తగ్గడం లేదు. ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఆర్టీసీ బస్సుల రాకపోకలు మొదలైనా.. ప్రజల్లో కరోనా భయం తొలగని కారణంగా.. రద్దీ అంతగా కనిపించడం లేదు.

అనంతపురం జిల్లా మడకశిర ఆర్టీసీ డిపో నుంచి అనంతపురానికి 2 సూపర్ లగ్జరీ.. పెనుగొండకు 2 ఆర్డినరీ బస్సులు వేశారు. వీటిలో మొదటి రెండు బస్సుల్లో కాస్త ప్రయాణికులు కనిపించినా.. మూడో బస్సు మాత్రం ఎవరూ రాకపోయేసరికి మళ్లీ డిపోకు వెళ్లిపోయింది. ప్రజల్లో కరోనా భయంపై తొలగని భయాందోళనలే.. ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details