అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం డోనేకల్లు వద్ద బళ్లారి-నెల్లూరు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. స్టీరింగ్ రాడ్ విరిగిపోవటంతో బస్సు అదుపు తప్పి వంకలోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదం నుండి 45 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గుంతకల్లు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గుంతకల్లు నుండి బళ్లారికి వెళ్తుండగా డోనేకల్లు వద్దకు రాగానే ... ఒక్కసారిగా బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోయాడు. అయితే ఎవరికీ చిన్నపాటి గాయం కాలేదు. బస్సును యంత్ర సాయంతో బయటకు తీశారు. ప్రయాణికులను ఆర్టీసీ అధికారులు మరో బస్సు ఏర్పాటు చేసి తరలించారు.
అనంతలో కాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు... 45 మంది సురక్షితం - అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు
ఆర్టీసీ బస్సు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటన అనంతపురం జిల్లా సమీపాన బళ్లారి నెల్లూరు జాతీయ రహదారిపై జరిగింది. స్టీరింగ్ రాడ్ విరిగిపోవటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 45 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు... 45 మంది సురక్షితం