ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ బస్సు బోల్తా..నలుగురు ప్రయాణికులకు గాయాలు - అనంతలో ఆర్టీసీ బస్సు బోల్తా

అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్​కు అస్వస్థతతో బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు.

ఆర్టీసీ బస్సు బోల్తా
ఆర్టీసీ బస్సు బోల్తా

By

Published : Jun 18, 2022, 9:51 PM IST

అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కంబదూరు నుంచి అనంతపురం వెళ్తున్న అనంతపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చిన్నంపల్లి-అచ్చంపల్లి మధ్య రోడ్డు పక్కన ఉన్న పొలాల్లో బోల్తా పడింది. డ్రైవర్‌కు అస్వస్థతగా ఉండటంతో బస్సు... అదుపుతప్పింది. పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details