దంపతులు పోగొట్టుకున్న బంగారు ఆభరణాలను ఆరు గంటల్లోనే గుర్తించి బాధితులకు అప్పగించారు అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే భద్రత పోలీసులు. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన లక్ష్మీ నరసయ్య, ప్రసన్న దంపతులు ముంబయికి వెళ్లేందుకు గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు బుధవారం రాత్రి చేరుకున్నారు. వారు ఎక్కాల్సిన కుర్లా ఎక్స్‌ప్రెస్‌కు బదులుగా ఉద్యాణ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. అనంతరం పొరపాటును తెలుసుకుని గుంతకల్లు దాటిన తరువాత హడావుడిగా దిగిపోయారు. అయితే వారి బ్యాగును ఉద్యాణ్ ఎక్స్‌ప్రెస్‌లోనే మర్చిపోయారు. అందులో విలువైన బంగారం ఉండటంతో గుంతకల్లు ఆర్పీఎఫ్ పోలీసులను ఆశ్రయించారు. ఆర్పీఎఫ్ ఎస్సై హర్షవర్థన్ వెంటనే స్పందించి అదే రైలులో విధులు నిర్వహిస్తున్న వీరేష్‌కు సమాచారం అందించారు. రైలు మంత్రాలయం వెళ్లే లోపే 20 తులాల బంగారం, 20 తులాల వెండి, 15 వేల నగదు ఉన్న బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 గంటల్లోనే దంపతులకు అప్పగించారు. అనంతరం ఆర్పీఎఫ్ ఎస్సై హర్షవర్థన్ ఆ దంపతులకు రిజర్వేషన్ చేసి ముంబయికి పంపించారు.
పోయిన బంగారాన్ని... ఆరు గంటల్లోనే అప్పజెప్పారు..! - gunthakallu railway protection force
రైల్వే పోలీసులు వేగంగా స్పందించటం వల్ల ఓ దంపతులు పోగొట్టుకున్న విలువైన బ్యాగు ఆరుగంటల్లోనే వారికి అందజేశారు. బ్యాగులో 20 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.15 వేల నగదు ఉన్నాయి. తమ బ్యాగును తమకు అందించిన పోలీసులకు ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన ఘటన వివరాలివి..!
బంగారు ఆభరణాలు