ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రొల్ల మండలంలో హైవే పనులను అడ్డుకున్న రైతులు - ఏపీ టుడే న్యూస్

అనంతపురం జిల్లా రొల్ల మండలంలో జరుగుతున్న హైవే పనులను రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా పరిహారం అందించడం లేదని నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. పరిహారం విషయంలో ఏదైనా సమస్య ఉంటే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

హైవే పనులను అడ్డుకున్న రైతులు
హైవే పనులను అడ్డుకున్న రైతులు

By

Published : Oct 14, 2020, 8:54 PM IST

అనంతపురం జిల్లా రొల్ల మండలంలో జరుగుతున్న హైవే పనులను రైతులు అడ్డుకున్నారు. భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ. 9 లక్షలు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చి... ఇప్పుడు కేవలం రూ.4 లక్షలే ఇస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డు పనులను అడ్డుకున్నారు. న్యాయం జరిగే వరకు పనులు నిలపివేయాలని డిమాండ్ చేశారు.

విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్​ హసీనా ఘటనాస్థలి చేరుకుని రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం భూమి విలువ ప్రకారం ఎకరాకు రూ.4 లక్షలు నిర్ణయించిందన్నారు. సంతృప్తి చెందకపోతే జిల్లా అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. పనులు అడ్డుకోవడం సరికాదని రైతులకు నచ్చచెప్పి పంపించారు.

ABOUT THE AUTHOR

...view details