Robbery in Train: అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలోని తురకపల్లి వద్ద దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే 7 హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైలు(12769) అనంతపురం నుంచి తురకపల్లి వద్దకు రాత్రి 9 గంటలకు చేరుకుంది. అయితే దుండగులు పథకం ప్రకారం అప్పటికే రైలు సిగ్నల్ వ్యవస్థను కత్తిరించడంతో రైలు తురకపల్లి ఔటర్ పట్టాలపై నిలిచిపోయింది. ఇదే అదనుగా భావించిన దుండగులు రైల్లోని ఎస్5, ఎస్7 బోగీల్లోకి చొరబడి ఇద్దరు ప్రయాణికుల నుంచి 6 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై ప్రయాణికులు మొదట గుత్తి పోలీసులకు సమాచారం అందించారు.
Robbery in Train: సిగ్నల్స్ తీగలు కత్తిరించి... ఆ రైలులో దొంగల బీభత్సం - అనంతపురం జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
Robbery in Train: తిరుపతి - సికింద్రాబాద్ రైలులో అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. అనంతపురం జిల్లా గుత్తి స్టేషన్ సమీపంలో సిగ్నల్ తీగలు కత్తిరించి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణికుల నుంచి నగలు, డబ్బు దోచుకెళ్లారు.
Robbery in Train: రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు పరిసర ప్రాంతాలను పరిశీలించి సిగ్నల్ వైర్లు తెగి ఉండటంతో వాటిని యథావిధిగా అమర్చి రైలును పంపించారు. అనంతరం బాధితులు డోన్‌లోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాచిగూడ స్టేషన్లోనూ విషయం తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసు వర్గాలు తెలిపాయి. సిగ్నల్ వ్యవస్థ కట్ చేసి ఇలా దోపిడీకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టి... కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: "ఇక్కడ పండు చెబితేనే ఏదైనా...మాతో వస్తే నీ కష్టాలన్నీ తీరిపోతాయి"