ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీఆర్వో ఇంట్లో చోరీ..7 తులాల బంగారం, 20 వేల నగదు అపహరణ - రెవెన్యూ అధికారి ఇంట్లో చోరీ

అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లిలోని ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. రెవెన్యూ అధికారి ఇంట్లో 7 తులాల బంగారం, 20 వేల నగదు ఎత్తుకెళ్లారు.

robbery in revenue officer at anantapuram
రెవెన్యూ అధికారి ఇంట్లో చోరీ

By

Published : Jun 27, 2021, 10:47 PM IST

Updated : Jun 27, 2021, 10:57 PM IST

అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లిలోని ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. 7 తులాల బంగారం, 20 వేల నగదు దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మన్మథరెడ్డి రెవెన్యూ డిపార్ట్​మెంట్​లో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా..ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కర్నూలు జిల్లా అహోబిలం పుణ్యక్షేత్రానికి దర్శనానికి వెళ్లారు. భార్య మాత్రం ఇంటి వద్దే ఉండిపోయింది.

ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండలేక..తాళం వేసి సమీప బంధువుల ఇంటికి వెళ్లింది. కాసేపటికి ఆమె ఇంటికి వచ్చి చూడగా..తలుపులు తెరిచి ఉన్నాయి. అనుమానంతో బీరువా వద్దకు వెళ్లి చూడగా.. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా..క్లూస్ టీం, డాగ్ స్వాడ్​తో ఎస్సై గురుప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Last Updated : Jun 27, 2021, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details