అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని కవిత హోటల్ పక్కన ఉన్న విఘ్ణు మొబైల్ షాప్‌లో దొంగతనం జరిగింది. దొంగతనం దృశ్యం సీసీ ఫుటేజ్ లో రికార్డు అయ్యింది. షాప్‌లో సీలింగ్ రేకును కట్ చేసి గుర్తు తెలియని దుండగులు దొంగతనం చేశారని షాపు యజమాని సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఉరవకొండలోని మొబైల్ షాపులో దొంగతనం - ఉరవకొండలోని మొబైల్ షాపులో దొంగతనం..
అనంతపురం జిల్లా ఉరవకొండలోని మొబైల్ షాపులో దొంగతనం జరిగింది. దొంగతనం దృశ్యం సీసీ ఫుటేజ్ లో రికార్డు అయ్యింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఉరవకొండలోని మొబైల్ షాపులో దొంగతనం..
సుమారుగా రూ.50 వేల విలువైన మొబైల్ ఫోన్లు, రూ.2 వేల పైచిలుకు నగదు అపహరణ జరిగిందని తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు షాపును పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి'రేషన్ డీలర్లకు బీమా సౌకర్యం కల్పించండి'