అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఓవస్త్ర దుకాణంలో దొంగలు పడి.. రెడీమేడ్ దుస్తులను ఎత్తుకెళ్లారు. దుండగులు షాప్ వెనుక వైపు కన్నం వేసి, దుకాణంలోకి చొరబడి... లక్షా 90 వేలు విలువ చేసే దుస్తులను, 10 వేల నగదును దొంగలించినట్లు యజమాని వెల్లడించారు. శని, ఆదివారాలు లాక్డౌన్ కారణంగా షాపు మూసివేసి ఉంచామని.. ఇంతలో చోరీ జరిగిందని దుకాణ యజమాని హర్షరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.
లాక్ డౌన్ లో అదును చూసి.. అందినంత దోచేశారు! - గుత్తి చోరీ న్యూస్
అనంతపురం జిల్లా గుత్తిలో వస్త్ర దుకాణం వెనుక కన్నం చేసిన దొంగలు.. చోరీకి పాల్పడ్డారు. లాక్డౌన్తో దుకాణం మూసి ఉంచామని.. ఇంతలో ఇలా అయ్యిందంని యజమాని ఆవేదన చెందారు.
![లాక్ డౌన్ లో అదును చూసి.. అందినంత దోచేశారు! robbery in cloth shop](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8365522-544-8365522-1597057042723.jpg)
వస్త్ర దుకాణంలో చోరీ