నంబులపూలకుంట మండలం పి. కొత్తపల్లి గ్రామంలోని చౌడేశ్వరి దేవి గుడిలో శనివారం చోరీ జరిగింది. ఆలయంలోని హుండీని బయటకు తీసుకొచ్చి పగలగొట్టారు.
అనంతరం అందులోని నగదును అపహరించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.