ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుత్తిలో ఒకే రోజు మూడు చోరీలు.. ఆందోళనలో ప్రజలు

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వరుస చోరీలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సోమవారం రాత్రి కమటాం, బండగేరి వీధుల్లో సుమారు 30 తులాల బంగారం, 20 తులాల వెండి, లక్ష రూపాయల నగదును దుండగులు దోచుకెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

robbery in ananthapuram district gutti town
గుత్తి పట్టణంలో వరుస చోరీలు

By

Published : Feb 25, 2020, 9:17 PM IST

గుత్తి పట్టణంలో వరుస చోరీలు

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఒకే రోజు 3 ఇళ్లల్లో దొంగతనాలు ప్రజలను ఆందోళనకు గురి చేశాయి. పట్టణంలోని కమటాం వీధి, బండగేరి వీధుల్లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. కమటాం వీధిలో నివాసముంటున్న రైల్వే ఉద్యోగి అరుణ్​కుమార్ భార్య పుట్టింటికి వెళ్లగా.. ఆయన​ విధులకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళాలను పగలగొట్టి బీరువాలో ఉన్న 25 తులాల బంగారం, 25 తులాల వెండి, 5 వేల నగదును దోచుకెళ్లారు. ఇదే తరహాలో బండగేరి వీధిలో నివాసం ఉండే ఆటో కమలాకర్​, రాము అనే వ్యక్తుల ఇంట్లోని 5 తులాల వెండి, 95 వేల నగదును దోచేశారు. ఇళ్ల యజమానులు తమ పనులు ముగించుకుని ఉదయం ఇంటికి వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్​ టీంతో ఆధారాలు సేకరించారు. రాత్రి సమయంలో పోలీసులు గస్తీ నిర్వహించకపోవడం వల్లే దొంగలు ఇలా ఇళ్లల్లోకి చొరబడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details