Robbery at ATM: ఏటీఎం కేంద్రాలలో అక్రమంగా నగదు డ్రా చేసుకెళ్లే హరియాణాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.77,500/- నగదు, 71 ఏటీఎం కార్డులు, 2 మొబైల్ ఫోన్ లు, 2.1 కేజీల గంజాయి, ఇతర సాంకేతిక పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు ఒకటో పట్టణ సీఐ ప్రతాపరెడ్డి తెలిపారు. కాగా ఇంకో నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు.
హరియాణాకు చెందిన ఇద్దరు నిందితులతో పాటు ఇంకొక వ్యక్తి కలిసి ఇతరులకు సంబంధించిన ఏటీఎం కార్డుల ద్వారా అక్రమంగా నగదు డ్రా చేసుకోవడం పరిపాటిగా చేసుకున్నారు. ఈక్రమంలో నాలుగు రోజుల కిందట స్థానిక సంగమేష్ నగర్ లోని ఓ ఏటీఎంలోకి ఈ ముగ్గురు చొరబడ్డారు. వీరి వద్ద ఉన్న సాంకేతిక పరికరాల సహాయంతో ఏటీఎం మెషిన్‌ను మేనేజ్ చేసి నగదు విత్ డ్రా చేసుకున్నారు. నగదు విత్ డ్రా వివరాలు ఖాతాదారుల అక్కౌంట్లలో నమోదు కాకుండా మోసాలకు పాల్పడ్డారు. ఏటీఎం నుంచి నగదు లోడ్ అయి బయటకు వచ్చే సమయంలో వారి వద్ద గల సాంకేతిక పరికరాలతో ఏటీఎం మెషిన్‌కు పవర్ సప్లయ్ కాకుండా చేశారు. నగదు తీసుకున్న తర్వాత పవర్ సప్లయ్ ఇచ్చారు. ఈ విధంగా మొత్తము సుమారు రూ. 4,05,500/- నగదు విత్ డ్రా చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Robbery at ATM: అకౌంట్‌కు మెసేజ్ వెళ్లకుండా.. పవర్ కట్ చేసి ఏటీఎంలో దొంగతనం - దొంగతనం
Robbery at ATM: ఏటీఎం కేంద్రాలలో అక్రమంగా నగదు డ్రా చేసుకెళ్లే ఇద్దరు వ్యక్తులను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.77,500/- నగదును స్వాధీనం చేసుకున్నారు.
Robbery at ATM