ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రయాణం ప్రాణాంతకంగా మారుతోందని వాహనచోదకులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని హిందూపురం-బెంగుళూరు వెళ్లే ప్రధాన మార్గాలు అధ్వానంగా మారాయి. కదిరి పట్టణంలోని కాలేజీ కూడలి, వేమారెడ్డి కూడలి, హిందూపురం రోడ్ లోని ఆంజనేయస్వామి గట్ల వద్ద రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కదిరి నుంచి అనంతపురం వెళ్లే ప్రధాన రహదారిలో కుటాగుళ్ల రోడ్డు దెబ్బతినడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు, వాహనచోదకులు కోరుతున్నారు.
ఆ రోడ్లపై ప్రయాణమంటే.. ప్రాణాలు పైకే..! - hindupuram constancy latest news
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని హిందూపురం, బెంగుళూరు వెళ్లే ప్రధాన మార్గాలు అధ్వానంగా మారాయి. గుంతలమయంగా మారిన ఈ మార్గంలో వెళ్లాలంటే వాహనచోదకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది.
నరకప్రాయమైన గుంతలు పడ్డ రోడ్లు