ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దెబ్బతిన్న రహదారులు.. వాహన చోదకులకు ఇక్కట్లు - అనంతపురంలో తాజా రోడ్ల పరిస్థితి

ఇటీవల కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. అనంతపురం జిల్లా కటారుపల్లి నుంచి సమీప ప్రాంతాలకు వెళ్లే మార్గంలో రహదారి గుంతలమయంగా మారింది. వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

roads damaged
దెబ్బతిన్న రహదారులు.. వాహన చోదకుల ఇక్కట్లు

By

Published : Dec 5, 2020, 8:05 PM IST

తుపాను ప్రభావంతో అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోగా.. మరికొన్ని చోట్ల గుంతలు పడ్డాయి. ఆ రోడ్లపై ప్రయాణం చేయడానికి వాహనదారులు ఆపసోపాలు పడుతున్నారు. గాండ్లపెంట మండలం కటారుపల్లి నుంచి గొడ్డువెలగల, తుమ్మలబైలు, సాధులవాండ్లపల్లికి వెళ్లే దారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ మార్గంలో భారీగా రాకపోకలు సాగుతాయి. వాహనదారులలు చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నా.. అధికారులు కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టలేదు.

ఈ నేపథ్యంలో రహదారులు రోజురోజుకు దెబ్బతింటున్నాయని స్థానికులు అంటున్నారు. కొన్నిచోట్ల వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడం వల్ల మడుగులను తలపిస్తున్నాయి. అధికారులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేయాలని గ్రామస్థులు, వాహన చోదకులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details