అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని చెరువులను కృష్ణా జలాలతో నింపేందుకు హంద్రీనీవా కాల్వను తవ్వారు. కొన్ని నెలల కిందట మడకశిర చెరువుకు కృష్ణా జలాలు సగం చేరాయి. అయితే మడకశిర నుంచి బెంగళూరుకు వెళ్ళే ప్రధాన రహదారిలో యు.రంగాపురం, కదిరేపల్లి గ్రామాల వద్ద హంద్రీనీవా కాలువ ఏర్పాటుకు అడ్డుగా ఉన్న రోడ్డును తవ్వి కాలువ ఏర్పాటు చేసి దానిపై వంతెన నిర్మించారు.
వంతెన నిర్మాణ అనంతరం ఆ ప్రాంతంలో గుంతలుగా మారిన రహదారిని... తిరిగి బీటీ రోడ్డు వేసి పునరుద్ధరించాల్సి ఉంది. అయితే సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆ ప్రదేశంలో చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును ఏర్పాటు చేయాలని ప్రజలు, వాహనచోదకులు కోరుతున్నారు.
గుంతలమయంగా హంద్రీనీవా కాలువపై రహదారి - madakasera news
కృష్ణా జలాల కోసం తవ్విన హంద్రీనీవా కాలువపై రహదారులు గుంతల మయంగా మారాయి. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని ఈ రహదారులను బీటీ రోడ్డు వేసి పునరుద్ధరించాల్సి ఉన్నా...అధికారులు పట్టించుకోవట్లేదని ప్రజలు, వాహనచోదకులు అంటున్నారు.
హంద్రీనీవా కాలువపై రహదారులు గుంతల మయం