ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ. 1.31 కోట్లతో రహదారి నిర్మాణ పనులు ప్రారంభం - kadiri mla siddhareddy news

కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి అనంతపురం జిల్లా తలుపుల మండలంలోని పలు గ్రామాల్లో రహదారి పనులను ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో అన్ని గ్రామాల రహదారులను మెరుగుపరుస్తామని చెప్పారు.

kadiri mla siddhareddy
తలుపుల మండలంలో రహదారి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

By

Published : Apr 10, 2021, 10:35 AM IST

అనంతపురం జిల్లా తలుపుల మండలం అక్కసానిపల్లి, వీరప్పగారిపల్లి గ్రామాల్లో రూ.1.31 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించనున్న సిమెంట్ రోడ్ల పనులకు కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి భూమి పూజ చేశారు.

నాణ్యతలో రాజీ పడొద్దని పంచాయితీరాజ్ ఇంజినీర్లకు ఎమ్మెల్యే సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో అన్ని గ్రామాల రహదారులను మెరుగు పరుస్తామని చెప్పారు. సర్పంచులు, వైకాపా నేతలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details