ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజకీయ చిచ్చుకు దారితీస్తున్న రహదారి విస్తరణ - తెలుగుదేశం నేత కందికుంట వెంకటప్రసాద్ రెడ్డి

అనంతపురం జిల్లా కదిరి ప్రధాన రహదారి విస్తరణ వివాదం రాజకీయ చిచ్చుకు దారితీస్తోంది. ఆస్తులు పోతాయనే తెదేపా నేత కందికుంట వెంకటప్రసాద్ రెడ్డి విస్తరణ పనులు అడ్డుకుంటున్నారని స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఆరోపించారు. భవనాలు, భూములు కోల్పోతున్న పేదలకు పరిహారం తెప్పించాలని తెదేపా నేత సవాల్ విసిరారు. దీంతో తెదేపా.. వైకాపా నేతల మధ్య మాటల తూటాలు కదిరిలో హీట్​ను పెంచుతున్నాయి.

road windening works in kadiri
రహదారి విస్తరణ

By

Published : Jun 22, 2021, 1:00 PM IST

అనంతపురం జిల్లా కదిరిలో ప్రధాన రహదారి విస్తరణ వ్యవహారం.. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య పరస్పర ఆరోపణలకు దారితీసింది. సొంత ఆస్తులను కాపాడుకునేందుకు తెలుగుదేశం నేత కందికుంట వెంకటప్రసాద్ రెడ్డి విస్తరణ పనులు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఆరోపించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కందికుంట వెంకటప్రసాద్.. విస్తరణ కోసం భవనాలు, భూములు కోల్పోతున్న పేదలకు పరిహారం తెప్పించాలని సవాల్ విసిరారు. తాను రూపాయి తీసుకోకుండానే సొంత భవన సముదాయాన్ని కూలుస్తానని మాట ఇచ్చారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details