అనంతపురం ఆర్టీసీ డిపోలో రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం ఎస్పీ సత్యయేసుబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయవద్దని డ్రైవర్లకు సూచించారు. ప్రమాదాలు జరిగే మలుపుల రహదారుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 30 ఏళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్లుగా పనిచేస్తూ ఒక్క ప్రమాదం చేయని డ్రైవర్లను సన్మానించారు.
ప్రమాదం చేయని డ్రైవర్లకు అధికారుల సన్మానం - road safety awareness program in anantapuram
అనంతపురంలో రహదారి భద్రతా వారోత్సవ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 30 ఏళ్లుగా సర్వీస్‌లో ఉండి ఒక్క ప్రమాదం చేయని డ్రైవర్లను అధికారులు సన్మానించారు.
ప్రమాదం చేయని డ్రైవర్లకు అధికారుల సన్మానం