అనంతపురం ఆర్అండ్బీ కార్యాలయంలో ఉన్నతాధికారి వల్ల ఇద్దరు చనిపోయారని ఉద్యోగులు ధర్నా చేశారు. ఎస్ఈ శ్రీనివాసులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఉద్యోగులు వాపోయారు. కరోనా సమయంలోనూ సమయపాలన లేకుండా కార్యాలయానికి రావాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ ఈయన వేధింపులకు గురైన ఇద్దరు ఉద్యోగులు ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యానికి గురై మరణించారని ఆరోపించారు. విధులకు హాజరు కాకపోతే..సస్పెన్షన్ వచ్చేలా చేస్తానని భయపెడుతున్నాడని వారు తెలిపారు. ఎస్ఈ వేధింపుల నుంచి తమకు న్యాయం చేయాలని కోరారు.
' మా ప్రాంతంలో కరోనా ఉన్నా... ఉద్యోగానికి రావాలంటున్నాడు' - అనంతపురంలో ఆర్ అండ్ బీ ఉద్యోగులు తాజా వార్తలు
ఓ ఉన్నతాధికారి తమను వేధింపులకు గురిచేస్తున్నాడని అనంతపురం ఆర్ అండ్ బీ కార్యాలయంలో ఉద్యోగులు ధర్నా చేశారు. అనారోగ్యంగా ఉన్నామని చెప్పిన కూడా..విధులకు హాజరుకావాలని ఒత్తిడి చేస్తున్నాడని వాపోయారు. తమకు న్యాయం కావాలని బాధితులు డిమాండ్ చేశారు.
అనంతపురంలో ఆర్ అండ్ బీ ఉద్యోగుల ధర్నా