అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కట్టకిందపల్లి వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కునుతూరు గ్రామానికి చెందిన రామాంజనేయులుగా గుర్తించారు. ఇతను అనంతపురంలోని ఓ కళాశాలలో సెక్యురిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఇంటి నుంచి కళాశాలకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రామాంజనేయులు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు మృతి - అనంతపురం రోడ్డు ప్రమాదంలో సెక్యురిటీ గార్డు మృతి
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కట్టకిందపల్లి వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్న ఘటనలో రామాంజనేయులు అనే సెక్యూరిటీ గార్డు మృతి చెందాడు.

రోడ్డుప్రమాదంలో సెక్యురిటీ గార్డు మృతి