అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని హరిపురం గ్రామం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారి పై ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ని ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం సాయంత్రం కర్ణాటకలోని బెంగళూరు నుంచి కర్నూలు జిల్లా ఆదోనికి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా... ప్రమాదవశాత్తు మార్గమధ్యలో ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా నగురూరుకి చెందిన వంశీ అనే యువకుడి తలకు గాయాలయ్యాయి. మరో యువకుడు వెంకటేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికుల సహాయంతో క్షతగాత్రున్ని 108 అత్యవసర వాహనంలో పెనుగొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ద్విచక్రవాహనం బోల్తా.. యువకుడికి తీవ్రగాయాలు..! - road accident one injuried in penukonda ananthpuram
ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయిన సంఘటన అనంతపురం జిల్లా హరిపురం గ్రామం వద్ద చోటుచేసుకుంది.
![ద్విచక్రవాహనం బోల్తా.. యువకుడికి తీవ్రగాయాలు..! road accident one injuried in penukonda ananthpuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6522755-220-6522755-1585033198941.jpg)
ద్విచక్రవాహనం బోల్తా.. యువకుడికి తీవ్రగాయాలు
TAGGED:
road accident