అనంతపురం జిల్లా కదిరి పట్టణం సమీపంలోని పిల్లవంక కాలనీ వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన కరిముల్లా, మస్తాన్ లు ఇద్దరూ ఉపాధికోసం ఓబుళదేవరచెరువుకు వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న కరిముల్లా చికిత్స కోసం కదిరికి ద్విచక్ర వాహనంలో తిరుగు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ప్రమాదంలో కరిముల్లా, మస్తాన్ గాయపడ్డారు. స్థానికుల సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా. తీవ్రంగా గాయపడిన కరిముల్లా చికిత్స పొందుతూ మృతి చెందారు.పోలీసులు కేసు నమోదు చేశారు.
కర్నూలు జిల్లాలో..