గుత్తిలో రోడ్డు ప్రమాదం... రెండు కాళ్లు కోల్పోయిన మహిళ - ananthapuram district road accident news
వివాహానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ రెండు కాళ్లు కోల్పోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది.

అనంతపురం జిల్లా గుత్తి పట్టణం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళా రెండు కాళ్లను కోల్పోయింది. పి.ఆర్ పల్లికి చెందిన జయరాముడు తమ సోదరి కుమార్తె వివాహానికి గుంతకల్లుకు వెళ్లారు. వివాహం అనంతరం తమ స్వగ్రామానికి ఆటోలో బయల్దేరారు. ఈక్రమంలో గుంతకల్లు నుంచి వెళ్తున్న ఆ ఆటోను ఎదురుగా వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో జయరాముడు భార్య రెండు కాళ్లను కోల్పోయింది. తాము కూలి పనులు చేస్తూ జీవిస్తున్నామని.... ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. తగిన వైద్యానికి సహాయ సహకారాలు అందించాలని వేడుకున్నారు.