బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ కారు.. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో ప్రమాదానికి గురైంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు.. అదుపుతప్పి విభాగినిని ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అదుపు తప్పి కారు బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు - గుత్తి నేర వార్తలు
అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదానికి గురైన కారును తొలగిస్తున్న సిబ్బంది
ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను కర్నూలుకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్రేన్ల సహాయంతో కారును తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి.