అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం రావివెంకటంపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఆనంద్ తాడిపత్రికి వచ్చి.. ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా.. మతిస్థిమితం లేని వ్యక్తి వాహనానికి అడ్డురావడంతో ప్రమాదం జరిగింది. గాయపడ్డ ఇద్దరినీ.. స్థానికులు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. మతిస్థిమితం లేని వ్యక్తి ఒడిశావాసిగా పోలీసులు గుర్తించారు.
మతిస్థిమితం లేని వ్యక్తిని ఢీకొట్టిన బైక్..ఇద్దరికి తీవ్ర గాయాలు - అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం
ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తికి .. మతిస్థిమితం లేని వ్యక్తి అడ్డురావడంతో ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది.
road accident