అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. స్వగ్రామం తిమ్మంపేట నుంచి ద్విచక్ర వాహనంపై కండ్ల గూడురుకు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి వెళ్తుండగా... వెనకనుంచి వేగంగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టింది. తలకు బలంగా గాయమై ఘటానా స్థలంలోనే ప్రతాప్ రెడ్డి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బొలేరో ఢీకొని వ్యక్తి మృతి - అనంతపురంలో రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం పై వెళ్తున్న వ్యక్తిని వెనకనుంచి వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టింది. బైకుపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
road accident