అనంతపురం జిల్లా గుత్తి శివారు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురుగా ఉన్న కల్వర్టును వీరి వాహనం ఢీకొట్టడంతో బోల్తా పడింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. క్షతగాత్రులను..పెట్రోలింగ్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వీరంతా శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లి అనంతపురం తిరిగి వస్తుండగా.. ప్రమాదం జరిగింది.
గుత్తి శివారులో జీపు బోల్తా.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు
గుత్తి శివారు టోల్‌ప్లాజా వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జీపు బోల్తాపడి ఒకరు మృతి చెందగా.. ఆరుగురికి గాయాలయ్యాయి. శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లి అనంతపురం తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
road accident