అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - అనంతపురం రోడ్డు ప్రమాదం న్యూస్
07:19 July 09
అనంతపురం జిల్లాలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనం అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొల్లపల్లి వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.... మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వేగంగా వచ్చిన వాహనం... బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మృతులు వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అచ్చెన్నాయుడి పట్ల అంత కర్కశమా?: హైకోర్టు