రాళ్ల అనంతపురంలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి
అనంతపురం జిల్లా రాళ్ల అనంతపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతపురం నగరానికి చెందిన ఇద్దరు రాజస్థాన్ వాసులు ద్విచక్ర వాహనంపై కదిరికి వెళ్తుండగా స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.