అనంతపురం జిల్లా చెన్నకొత్తపల్లి మండలం ప్యాదిండి వద్ద 2 ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనటంతో.... ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులు సీకె పల్లి మండలం న్యామద్దల గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. స్థానికంగా నివాసం ఉంటున్న పుల్లన్న తన కుమారుడు ఆదినారాయణతో కలిసి ద్విచక్రవాహనంపై పక్క ఊరు వెళ్లి వస్తున్నారు. అదే గ్రామానికి చెందిన నరేష్ పని నిమిత్తం ధర్మవరానికి వెళ్తూ ప్యాదిండి వద్ద వీరి వాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాదంలో నరేష్, పుల్లన్న అక్కడికక్కడే మృతి చెందగా... ఆదినారాయణ ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోవటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి - అనంతపురంలో రోడ్డు ప్రమాదం న్యూస్
ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొట్టడం వల్ల ముగ్గురు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా చెన్నకొత్తపల్లిలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గ్రామానికి చెందిన ముగ్గురూ ఒకేసారి మరణించడం వల్ల విషాద ఛాయలు అలుముకున్నాయి.
road-accident-in-ananthapuram-district