ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి - road accident news in ananthapuram district

అనంతపురం జిల్లా గజ్జల గారి పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

road accident in ananthapuram district
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

By

Published : Jan 7, 2020, 5:57 AM IST

అనంతపురం జిల్లా తలుపుల మండలం గజ్జల గారి పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా పెండ్లిమర్రి మండలానికి చెందిన ఆరుగురు యువకులు చామంతి పూలను బెంగళూరు మార్కెట్​కు ఐచర్ వాహనంలో తరలిస్తుండగా... గజ్జల గారి పల్లె సమీపంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో వాహనం పైన ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనం లోపల కూర్చున్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న నల్లమాడ సీఐ నరసింహారావు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లారు. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details