ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి... మరో ఇద్దరికి తీవ్ర గాయాలు - ananthapuram district crime news

అనంతపురం జిల్లా గుడిబండ మండలం కేకాతి గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొనటంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

road accident in ananthapuram district, on ewomen death and two men sevier
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

By

Published : Aug 20, 2020, 10:47 PM IST

గుడిబండ మండలం రాళ్లపల్లి గ్రామానికి చెందిన నరసేగౌడ్... కదిరేపల్లి గ్రామ సచివాలయంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం నరసేగౌడ్ అతని భార్య అంబిక, మరో అమ్మాయి పద్మావతితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా... కేకాతి గ్రామం వద్ద వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో పద్మావతి అక్కడికక్కడే మృతి చెందింది. నరసేగౌడ్, అతని భార్య అంబికకు తీవ్ర గాయాలయ్యాయి.

గమనించిన స్థానికులు... క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా మడకశిరకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హిందూపురం ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరు బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. ఊహించని ఈ ఘటనతో బాధితుల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details