అనంతపురం జిల్లా కదిరి పట్టణం కుటాగుళ్ల సమీపంలో.. 42వ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అనంతపురానికి చెందిన జయకృష్ణ, రాజు ద్విచక్రవాహనంపై కదిరికి వెళ్తున్న సమయంలో కుటాగుళ్ల మలుపులో కారు ఢీకొట్టింది.
కదిరి కుటాగుళ్ల వద్ద రోడ్డు ప్రమాదం...ఇద్దరు యువకులు మృతి - కదిరి కుటాగుళ్ల వద్ద రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లా కదిరిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కుటాగుళ్ల సమీపంలో 42వ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
కదిరి కుటాగుళ్ల వద్ద రోడ్డు ప్రమాదం
కారు యువకులతో పాటు ద్విచక్ర వాహనాన్ని కొన్ని అడుగుల దూరం ఈడ్చుకెళ్లింది. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రాంతీయ వైద్యశాల తరలించారు. మృతుల వద్ద లభించిన ఆధార్ కార్డుల ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :గర్భం దాల్చిన మైనర్.. రాత్రికి రాత్రి బాలుడుతో వివాహం!