అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుడు మృతి చెందారు. గ్రామానికి చెందిన హనుమప్ప ఓ శుభకార్యం నిమిత్తం చెర్లోపల్లి గ్రామం వెళ్లి తన మామ హనుమప్పతో తిరిగివస్తుండగా.. మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టింది. గమనించిన స్థానికులు వీరిని 108 వాహనంలో కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మామ అల్లుళ్ల మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డివైడర్ను ఢీకొన్న బైక్.. మామఅల్లుళ్ల మృతి - latest news of road accidents in anantapur dst
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో విషాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మామ అల్లుడు మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
road accident in anantapur dst two died