అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి 44వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జవ్వగా... లోపల ఉన్న వారిని స్థానికులు ఎంతో కష్టపడి బయటకు తీశారు. బెంగుళూరు నుంచి గుల్బర్గా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా యోగిత పూజారి(40) చనిపోయారు. మిగతా ముగ్గురు ప్రయాణికులైన కాంచన్ పూజారి, నితిన్ పూజారి, ప్రథమేష్ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లా 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన కారు
క్షతగాత్రులను బయటకు తీస్తున్న స్థానికులు