ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తండ్రితో నామపత్రాలు దాఖలు చేయించి.. తనువు చాలించాడు! - penukonda road accident

తండ్రిని ఊరి సర్పంచ్​గా నిలబెట్టాలనుకున్నాడు ఓ కుమారుడు. ఆయన వెన్నంటే ఉంటూ.. దగ్గరుండి నామినేషన్ పనులను పూర్తి​ చేయించాడు. కానీ ఆ కోరిక తీరకుండానే.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

road accident
తండ్రితో నామపత్రలను దాఖలు చేయించి తనువు చాలించాడు

By

Published : Feb 11, 2021, 5:35 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం మెళవాయి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తెదేపా మద్దతుదారుడిగా ముద్ద రంగప్ప నిన్న నామినేషన్​ దాఖలు చేశారు. ఈ ప్రక్రియ మెుత్తం ఆయన కుమారుడు ఉమేష్ దగ్గరుండి చూసుకున్నారు.​ అనంతరం ఉమేష్​ తన స్వగ్రామం పెనుకొండకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.

ఈ సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టటంతో అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న పార్థివ దేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ABOUT THE AUTHOR

...view details