అనంతపురం జిల్లా గుత్తికి చెందిన కుటుంబ సభ్యులు.. కర్నూలు జిల్లా డోన్ మండలం ఓబుళాపురంలో బంధువుల ఇంటికి వెల్లి వస్తున్నారు. గుత్తి మండలం కరిడికొండ గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై శునకం అడ్డుగా రావడంతో.. దాన్ని తప్పించే ప్రయత్నంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గుత్తి ఎస్సీ కాలనీకి చెందిన 9మంది గాయపడగా.. రిషికా (6) మృతి చెందింది. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ రహదారిపై ఆటో బోల్తా.. చిన్నారి మృతి - గుత్తిలో రహదారి ప్రమాదం న్యూస్
అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో ఒక చిన్నారి మృతి చెందగా.. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

road accident child died in ananthapuram