ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పనులు ముగించుకుని వస్తుండగా ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు - road accidents news

అనంతపురం జిల్లా మడకశిర మండలం తడకలపల్లి గ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

injured people
చికిత్స పొందుతున్న గాయపడిన వ్యక్తులు

By

Published : Dec 3, 2020, 7:19 AM IST

అనంతపురం జిల్లాలోని తడకలపల్లి గ్రామ సమీపంలో ఆటో, ద్విచక్రవాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పలువురికి దెబ్బలు తగిలాయి. క్షతగాత్రులను మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హిందూపురం హాస్పిటల్​కి తీసుకెళ్లారు.

ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా మడకశిర మండలానికి చెందిన వారు. వీరంతా ఉపాధి కోసం హిందూపురం సమీపంలో గల గార్మెంట్స్ ఫ్యాక్టరీకి వెళ్లి పనులు ముగించుకొని వస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details