అనంతపురం జిల్లా పెనుకొండ మండలం రాంపురం సమీపంలో పెనుకొండ-పుట్టపర్తి ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు వెనుక వస్తున్న బస్సు కింద పడి మరణించగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని స్థానికులు పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు పెనుకొండ మండలం శెట్టిపల్లికి చెందిన నారాయణరెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఇతను కియా అనుబంధ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి విధులకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ఎదురుగా వస్తోన్న ద్విచక్ర వాహనం ఢీ కొని కింద పడిపోయాడు. వెనుక నుంచి వస్తోన్న బస్సు అతనిపై నుంచి వెళ్లడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ... ఒకరు మృతి - అనంతపురం లెటెస్ట్ న్యూస్
అనంతపురం జిల్లా రాంపురం సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని.. ప్రమాదవశాత్తు వెనుక వస్తున్న బస్సు కింద పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ...ఒకరు మృతి