ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు - road accident in ananthapur district

రొద్దంకి మండలం ఆర్​ కొట్టాల గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరు మృతి చెందగా... ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆర్​ కొట్టాల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం
ఆర్​ కొట్టాల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం

By

Published : Sep 29, 2020, 9:04 PM IST

రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా రొద్దంకి మండలం.. ఆర్. కట్టాల గ్రామంలో ఈ ఘటన జరిగింది.

మృతుడిని పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన వీరేష్​ (25)గా గుర్తించారు. క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details