అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పి.కొత్తపల్లిలో ద్విచక్రవాహనాన్ని బోలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నరేంద్ర(25) చందు(21) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. కర్ణాటక పావగడకి చెందిన బొలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో నరేంద్ర, చందు అక్కడికక్కడే మరణించగా.... ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలియజేశారు.
పి.కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - పి.కొత్తపల్లిలో ఇద్దరు మృతి
ద్విచక్రవాహనాన్ని బోలెరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పి.కొత్తపల్లిలో జరిగింది.
![పి.కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి road accident at p. kottapalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9617947-840-9617947-1605978405434.jpg)
పి.కొత్తపల్లిలోరోడ్డు ప్రమాదం