అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం కొనకొండ్ల శివార్లలోని 63వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని స్కార్పియో వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణ స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు విడపనకల్ మండలం పొలికి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి, కిషోర్ రెడ్డిగా గుర్తించారు. స్కార్పియోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలు కాగా వారిని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
మృత్యువులోను వీడని స్నేహం... రోడ్డు ప్రమాదంలో స్నేహితులు దుర్మరణం - anantapur district latest news
ఊరి నుంచి కలిసివెళ్లిన ప్రాణ స్నేహితులు తిరిగి వస్తారని ఇంటి దగ్గర భార్య పిల్లలు ఎదురు చూశారు. కానీ స్కార్పియో రూపంలో మృత్యువు వారిద్దరిని తీసుకెళ్లింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
![మృత్యువులోను వీడని స్నేహం... రోడ్డు ప్రమాదంలో స్నేహితులు దుర్మరణం road accident at knkondla in anantapur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10626975-685-10626975-1613316951060.jpg)
మృత్యువులోను వీడని స్నేహం... రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు దుర్మరణం
గుంతకల్లు నుంచి ద్విచక్ర వాహనంపై గోపాల్ రెడ్డి, కిషోర్ రెడ్డి వస్తుండగా రాంగ్ రూట్లో అత్యంత వేగంతో స్కార్పియో వచ్చి ఢీకొట్టింది. స్కార్పియో గుద్దిన వేగానికి ద్విచక్రవాహనం అక్కడికక్కడే కాలిపోయింది. మృతుడు గోపాల్ రెడ్డి భార్య అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తుండగా వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కిషోర్ రెడ్డి.. స్టోర్ డీలర్ కాగా భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. పోలీసులు మృతదేహాలను గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి