అనంతపురం జిల్లా గాండ్లపెంట వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కల్లుబాయి తండాకు చెందిన వెంకటరమణ, నరసింహులు నాయక్‌లు గాండ్లపెంట నుంచి స్వగ్రామానికి సూపర్ ఎక్సెల్లో బయలుదేరారు. రెక్కమాను నుంచి గాండ్లపెంటకు వస్తున్న మరో ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి సూపర్ ఎక్సెల్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణ, నరసింహులు నాయక్‌లను 108 వాహనంలో చికిత్స నిమిత్తం కదిరి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు ఇద్దరిని అనంతపురం తరలించారు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకటరమణ , నరసింహులు నాయక్‌లు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న గాండ్లపెంట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొత్త సంవత్సరం తొలి రోజే రెండు కుటుంబాల్లో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు దుర్మరణం - గాండ్లపెంట రోడ్డు ప్రమాదం తాజా సమాచారం
అనంతపురం జిల్లా గాండ్లపెంట వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కల్లుబాయి తండాకు చెందిన వెంకటరమణ, నరసింహులు నాయక్‌లు గాండ్లపెంట నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్త సంవత్సరం తొలి రోజే రెండు కుటుంబాల్లో ఈ ప్రమాదం తీవ్ర విషాదం నెలకొంది.
![ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు దుర్మరణం road accident at gandlapenta ananthapuram district two people died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10079190-45-10079190-1609482851757.jpg)
ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు దుర్మరణం