కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటన అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం దేవరపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా కూలీ మృతి చెందగా, ముగ్గురు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు చెన్నైకొత్తపల్లి మండలం ఒంటికొండకు చెందిన వెంకటలక్ష్మమ్మగా పోలీసులు గుర్తించారు.
కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా... ఒకరు మృతి - recent accident at devarapalli
అనంతపురం జిల్లా దేవరపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి