ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బైక్​ను ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి మరొకరికి తీవ్రగాయాలు - road accident news in anantapur district

అనంతపురం జిల్లాలో ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

road accident at darmavaram in anantapur district
బైక్​ను ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి మరొకరికి తీవ్రగాయాలు

By

Published : Mar 22, 2021, 10:09 AM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని.. కియా ఉద్యోగులను తీసుకెళ్లే బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక రైల్వే వంతెనపై మొదట ఓ ఆటోను ఢీకొన్న బస్సు.. ద్విచక్రవాహనంపైకి దూసుకెళ్లింది. ద్విచక్రవాహనం బస్సుకు అతుక్కుపోగా.. అర కిలోమీటర్‌ వరకు అలాగే ఈడ్చుకుంటూ వెళ్లిన డ్రైవర్‌.. పోతుకుంట వద్ద నిలిపేసి పరారయ్యాడు. నరేంద్ర అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. రవి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details