అనంతపురం జిల్లా బత్తలపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తాడిమరి మండలం పిన్నదరి గ్రామానికి చెందిన సూర్యనారాయణ, ఆదెమ్మ, చెన్నకేశవులు, పెద్దక్క మృతి చెందారు. పిన్నదరికి చెందిన సూర్యనారాయణ.. అతని భార్య యాదమ్మతో కలిసి ఆటోలో బొప్పాయి కాయలు అమ్మేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అనంతపురంలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం.. - ఈటీవీ భారత్ తాాజా వార్తలు
అనంతపురం జిల్లాలోని బత్తలపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో... నలుగురు మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
అనంతపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
సూర్యనారాయణ, ఆదెమ్మ అక్కడికక్కడే మృతి చెందగా... అదే ఆటోలోప్రయాణీస్తున్న చెన్నకేశవులు, పెద్దక్కకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో వారిద్దరు మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. బత్తలపల్లి సీఐ చిన్న పెద్దయ్య సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. లారీ డ్రైవర్ పరారయ్యాడు
ఇదీ చదవండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1933 కరోనా కేసులు...19 మరణాలు
Last Updated : Jul 12, 2020, 6:39 PM IST