అనంతపురం జిల్లాలో వేర్వేరు చోట్ల రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఓ ప్రమాదంలో పని కోసం వెళ్తున్న కూలీల బతుకులు తెల్లారిపోయాయి. పామిడి శివారులో కూలీల ఆటోను.. లారీ ఢీట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన శంకరమ్మ, నాగవేణి, చిట్టెమ్మ(35), సుబ్బమ్మ(45), సావిత్రి(40) గా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సింగనమల నియోజకవర్గ వైకాపా నేత ఆలూరు సాంబశివారెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..
ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ చనిపోయారు. ఆటో డ్రైవర్ రాంగ్ రూట్లో వెళ్లడం వల్లే ళ్తుండడం వల్లే ప్రమాదం జరిగిందని తాడిపత్రి డీఎస్పీ చైతన్య చెప్పారు.