అనంతపురం జిల్లా రాయదుర్గంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు చెన్నవీర అనే ఆర్ఎంపీ వైద్యుడికి చెందిన క్లినిక్‌ను ప్రభుత్వ వైద్యాధికారి రమేష్ సీజ్ చేశారు. వైరస్ అదుపు చేయడానికి ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతుంటే ఆర్ఎంపీ వైద్యులు మాత్రం అరకొర వైద్యం చేస్తూ సామాన్య ప్రజల దగ్గర ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. దీంతో ఇలాంటి ఆర్ఎంపీ వైద్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజల ప్రాణాలతో ఆర్ఎంపీలు చెలగాటం - అనంతపురం జిల్లా రాయదుర్గంలో కరోనా వార్తలు
కరోనా వ్యాప్తితో ఒకవైపు.. లాక్‌డౌన్‌తో మరోవైపు ప్రజలు నానా తంటాలు పడుతుంటే ఇదే అదునుగా కొంతమంది ఆర్ఎంపీ వైద్యులు డబ్బులకు కక్కుర్తి పడుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇది గుర్తించిన అధికారులు అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆర్ఎంపీ వైద్యుడికి చెందిన క్లినిక్‌ను సీజ్ చేశారు.
ప్రజల ప్రాణాలతో 'ఆర్ఎంపీ'లు చెలగాటం