ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారుల నిర్మాణానికి భూమిపూజ.. రూ.20 కోట్లతో పనులు - రాష్ట్ర పాఠశాలల నియంత్రణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి

గ్రామ స్థాయి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పాఠశాలల నియంత్రణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా నార్పల మండలంలోని గంగనపల్లి, జంగంరెడ్డి పేట, రంగాపురం గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్లకు భూమి పూజ చేశారు.

rituals  to be performed before start of road construction in narpala
నార్పల మండలంలో రహదారుల నిర్మాణానికి భూమిపూజ

By

Published : Jul 11, 2020, 6:12 PM IST

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పాఠశాలల నియంత్రణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి చెప్పారు. నార్పల మండలంలోని గంగనపల్లి, జంగంరెడ్డి పేట, రంగాపురం గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్లకు ఆయన భూమి పూజ చేశారు.

తాము అధికారంలోకి వచ్చాక రోడ్ల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో రూ.20 కోట్లతో రహదారులు నిర్మిస్తున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details